
బాబు ప్రభుత్వంలో రైతులకు కష్టాలే
రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున
చీమకుర్తి రూరల్: చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ముందుగా మోసపోయేది, నష్టపోయేది రైతులు, మహిళలే అని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని పిడతలపూడి, రామచంద్రపురం, బూసరపల్లి, జీఎల్‌పురం గ్రామాల్లో శుక్రవారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పిడతలపూడిలో బాబూ ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతన్న పంట పండిస్తే మద్దతు ధర కల్పించలేని దయనీయ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మద్దతు ధర కల్పించాలని ధర్నాలు చేస్తేకాని, మద్దతు ధర పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి రాలేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల పక్షాన పోరాడితే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నా రైతుల ఆవేదన బాబుకు పట్టదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, మండల ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి జీ ఓబులరెడ్డి, కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, ఎం రాజేంద్ర, మేకల వీరారెడ్డి, డీ శేషారెడ్డి, బొడ్డు కోటేశ్వరరావు, తిరుపతిస్వామి, మల్లికార్జున, బాలాజి, నియోజకవర్గ యూత్ అన్వేష్, కంకణాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.