
ఆక్వా రైతులను కాపాడాలి
కొత్తపట్నం: సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు శుక్రవారం మండలంలో ఉన్న రొయ్యల చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వా యజమానులను కలుసుకున్నారు. ఈ నెల 8వ తేదీ ఒంగోలు ఎల్‌బీజీ భవనంలో ‘‘రొయ్యల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత – ప్రత్యామ్నాయ మార్గాలు’’ అనే అంశంపై ఆక్వా రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని, సమావేశాన్ని ఆక్వా రైతులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా విధించిన అధిక టారిఫ్‌ల వల్ల రాష్ట్రంలో ఆక్వా రంగంలో ఉన్న రెండున్నర లక్షల రైతులపై ప్రభావం పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ స్వామి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.