
ఆదర్శనీయుడు సర్వేపల్లి
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం పలువురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం
ఉపాధ్యాయులను సత్కరిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి, చుండూరి రవిబాబు, బత్తుల
ఒంగోలు టౌన్: ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి తొలి రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, తరగతి గదిలో దేశ నిర్మాణానికి పునాదులు వేసే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం గర్వంగా ఉందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాతలను తయారు చేసే ఉపాధ్యాయుడిగా పనిచేసిన రాధాకృష్ణ దేశానికే తొలి పౌరుడిగా ఎన్నికయ్యారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉపాధ్యాయులను సన్మానించే సంప్రదాయానికి తెరదీశారని చుండూరి రవిబాబును అభినందించారు. జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఉపాధ్యాయులు వారికి బంగారు భవిష్యత్తు ఇస్తారని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ గురువులను పార్టీ కార్యాలయంలో సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. దేశాభివృద్ధికి ఉపాధ్యాయులు చేసిన సేవలు మరిచిపోలేమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఓబుల రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, ముప్పవరపు శ్రీనివాసులు, ఉపాధ్యాయిని నత్తల రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ సన్మాన గ్రహీతలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, కఠారి శంకర్, బొట్ల సుబ్బారావు, వైఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ), రొండా అంజిరెడ్డి, కరుణాకర్, నగరికంటి శ్రీనివాసరావు, బంగారుబాబు, ప్రసాద్, రవీంద్రా రెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, టి.మాధవి, వాణి, గోనెల మేరి, ప్రమీల, దేవా, జనార్ధన్ రెడ్డి, కిరీటి పాల్గొన్నారు.