
కఠినంగా శిక్షించాలి
నిందితులను
కంభం:
దారుణ హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త గాలిబ్రహ్మయ్య కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకట రాంబాబు శుక్రవారం ఉదయం కంభం ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించారు. మండలంలోని దరగా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య (25) గురువారం హత్యకు గురికాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పోలీసులతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త మృతి బాధాకరమని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా దరగా లో అంత్యక్రియలు నిర్వహించారు. వారి వెంట ఎంపీపీలు ఓసూరారెడ్డి, వెంకట్రావు, ఏరువ రంగారెడ్డి, మండల కన్వీనర్‌లు గొంగటి చెన్నారెడ్డి, ఆవుల శ్రీధర్ రెడ్డి, స్టేట్ మైనారిటీ సెల్ సెక్రటరీ గఫార్ అలిఖాన్, చేగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, రవికుమార్, సాంబశివారెడ్డి, సయ్యద్ ఖాసిం, సలీం, హుస్సేన్‌బాష, గురుమూర్తి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.

కఠినంగా శిక్షించాలి