
బైక్ మెకానిక్ గంజాయి వ్యాపారం
● గంజాయి తరలిస్తూ ఒంగోలు పోలీసులకు చిక్కిన నిందితుడు
● 10 కేజీల గంజాయి స్వాధీనం
ఒంగోలు టౌన్: విశాఖపట్నం నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఈఎస్ జనార్దన్ వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన పాండిరాజన్ మోటార్ బైకు మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతడి స్నేహితుడైన భాస్కరన్ సెంట్రింగ్ పనులకు వెళుతుంటాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నంలోని పూజారి బుచ్చిబాబు దగ్గర కిలో రూ.3,500 చొప్పున 10 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. మధురైకి చెందిన తంబియన్‌కు కిలో రూ.12,500లకు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. రైలు మార్గం ద్వారా విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వెళుతున్న క్రమంలో ఒంగోలు రైల్వేస్టేషన్ ఎదరుగా రైల్వే కోచ్ రెస్టారెంట్ వెనక ఆటోస్టాండ్ వద్ద ఉండగా అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సీఐలు ఆర్.నరహరి, ఎస్.రామారావు, ఎస్సైలు రాజేంద్ర, మౌలాలీలు బ్యాగులు తనిఖీ చేశారు. అందులోని 10 కేజీల గంజాయితో పాటుగా రెండు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను ఒంగోలు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, కానిస్టేబుళ్లు జయసూర్య, శ్రీనివాస్, నాగరాజు, బాల సుబ్బయ్య, వెంకటరావు, రామిరెడ్డి, చలపతి, హర్ష, కొండలరావు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ అభినందించారు.

బైక్ మెకానిక్ గంజాయి వ్యాపారం