
సందెవేళ.. ప్రకృతి హేల
– కంభం
సూర్యుడు అస్తమించే సమయంలో సుందర దృశ్యం
సాయం సంధ్యవేళలో కంభం చెరువు మధ్యలో పడుతున్న సూర్యకిరణాలు
సూర్యాస్తమయ సమయంలో
కనువిందు చేస్తున్న కంభం చెరువు
సాయంసంధ్య వేళలో అస్తమించే రవి కిరణాలు ప్రకృతి కాన్వాసుపై అద్భుత వర్ణచిత్రాలను ఆవిష్కరించాయి. ఇటీవల కురిసిన వర్షాలకు
చారిత్రాత్మక కంభం చెరువులో 7 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. సాయంత్రం 6.30 నుండి 7 గంటల మధ్యలో
సూర్యాస్తమయ సమయంలో సూర్య కిరణాలు నీటి పై పడుతూ వివిధ రంగులను ఆవిష్కరించిన దృశ్యం చూపరులను కట్టిపడేసింది.
సాయంత్రం పూట పలువురు సందర్శకులు చెరువు వద్దకు వెళ్ళి సరదాగ సెల్ఫీలు తీసుకుంటూ గడుపుతున్నారు.

సందెవేళ.. ప్రకృతి హేల