
హామీలు విస్మరించడం చంద్రబాబు నైజం
మద్దిపాడు: ఎన్నికలకు ముందు అలివిమాలిన హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే విస్మరించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. మండలంలోని మద్దిపాడు, బసవన్నపాలెం గ్రామాల్లో ఆదివారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చి ఒకటి అరా అరకొరగా హామీలు చేసి అన్ని హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు నమ్మిన ప్రతిసారి వారిని నిలువునా మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. ప్రజలకు మేలు చేయడం కంటే తన సొంత లాభం చూసుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణాల పేరుతో చేపడుతున్న పనులు పనికి వచ్చేవేనా అంటూ ప్రశ్నించారు. నిలువెత్తు నీళ్లలో మునిగిన అమరావతిని ప్రజలు ప్రసార మాధ్యమాల ద్వారా చూసి ఇక్కడ అమరావతి నిర్మించడం ఏమిటని ప్రశ్నిస్తున్నా తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అని వాదించే రకం చంద్రబాబు అన్నారు. 14 నెలల కాలంలో లక్షల కోట్లు అప్పులు తీరి రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితులు తీసుకువస్తున్నారన్నారు. చంద్రబాబు ఏనాడైనా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు. కూటమి నాయకులు మేనిఫెస్టోను గ్రామాల్లోకి తీసుకువెళ్లి మది మంచి ప్రభుత్వం అని చెప్పే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో జరుగుతున్న మోసాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. అనంతరం మద్దిపాడు, బసవన్నపాలెం గ్రామాల్లో క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. మద్దిపాడు గ్రామ పార్టీ అధ్యక్షునిగా కాకుమాను శశికుమార్‌ను ఎంపిక చేసి ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ అప్పారావు ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు మోరబోయిన సంజీవరావు, మద్దా లక్ష్మీనారాయణ, నట్టే సంజీవరావు, కంకణాల సురేష్, నాదెండ్ల మహేష్, సన్నపు రెడ్డి రమణమ్మ, చిన్న అప్పయ్య, శ్రీరామమూర్తి, అబ్దుల్ మజీద్ పైనం ప్రభాకర్, పోకూరి శ్రీరామ మూర్తి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.