
సీనియర్ అంతర్‌జిల్లాల మహిళా జట్టు ఎంపిక
ఒంగోలు: ప్రకాశం జిల్లా సాఫ్ట్‌బాల్ సీనియర్ మహిళా జట్టు ఎంపిక ఆదివారం స్థానిక శ్రీహర్షిణీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జరిగింది. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులైన పి.నరసింహారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎ.రాంప్రసాద్ పర్యవేక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలను త్వరగా పొందవచ్చన్నారు. ఈనెల 30,31 తేదీల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో కూడా రాణించి జిల్లా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని కోరారు.
జిల్లా జట్టు.. సీహెచ్ మాధురి, జి.తేజస్విని, బి.భవాని, బి.భాగ్యశ్రీ, సీహెచ్ హక్స్ ప్రియ, బి.కీర్తిన, ఎన్.ప్రణతి, బి.భావన, ఐ.నాగవేణి, చైత్ర, సుల్తానా గ్రేస్, హాసిని, ధరణి, చరితారెడ్డి, ఆమోస్.