
ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
దర్శి: మండలంలోని రాజంపల్లి గ్రామంలో ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ రాఘవరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో విజిలెన్స్ ఏఓ శివనాగప్రసాద్, ఏఓ రాధలు కలసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 5.76 మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండానే విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాల పై దుకాణం నిర్వాహకుడు మురళీపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కొండపి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గురువారం సాయంత్రం మండలంలోని ముప్పవరం గ్రామంలో కారు, బైక్ ఢీకొన్నాయి.ఆ సంఘటనలో గాయపడిన పెరిదేపి గ్రామానికి చెందిన అంగలకుర్తి చిన్న పౌలు(55)ను చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న చిన్న పౌలు ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు.

ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు