
సీబీఎస్‌సీ సౌత్ జోన్ తైక్వాండో విజేతలకు బహుమతులు
మార్కాపురం టౌన్: పట్టణంలోని కమలా హైస్కూల్‌లో మూడు రోజులుగా జరుగుతున్న సీబీఎస్‌సీ స్కూల్స్ సౌత్‌జోన్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలను టోర్నమెంటు అబ్జర్వర్ సీ దొరై, హైస్కూల్ ప్రిన్సిపల్ స్వరూప్ రంజన్ అందజేశారు.
ఒంగోలు సిటీ: ఆర్పీలకు నష్టం కలిగించే ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా ద్వితీయ మహాసభ బీ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.వి కొండారెడ్డి మాట్లాడారు. అనంతరం ఈ సభలో ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ఆర్పీలందరూ పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ధారా రూతమ్మ, గౌరవ అధ్యక్షురాలిగా కల్పన, ప్రధాన కార్యదర్శిగా నారాయణస్వామి రాజ్యలక్ష్మి, కోశాధికారిగా పమిడి పద్మశ్రీ,, సహాయ కార్యదర్శిగా జమ్మలమడుగు సుజాత, నయోమి, ఉపాధ్యక్షులుగా పీ ఆదిలక్ష్మిని పాలకవర్గంగా ఎన్నుకున్నారు. 11 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నార ని చెప్పారు. ఈ సందర్భంగా వేతనాలు పెంచాలని, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఆన్‌లైన్ యాప్స్ శిక్షణ ఇవ్వాలని, రూ.10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో సాయి లక్ష్మి, రేణుక, రమణ, దివ్య శాంతి, శ్రీ లక్ష్మి, చంద్రిక, భారతి తదితరులు పాల్గొన్నారు.