
25న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ–2025 కు సంబంధించి వివిధ కేటగిరీల్లో 629 పోస్టులకు సెలెక్షన్ కమిటీ నిర్ణయించిన కమిటీలచే ఎంపికై న అభ్యర్థులందరూ ఈ నెల 25వ తేదీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని డీఈఓ కిరణ్‌కుమార్ శనివారం తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు చెరువుకొమ్ముపాలెంలోని సరస్వతి జూనియర్ కళాశాలలో హాజరు కావాలని కోరారు. మెసేజ్ వచ్చిన అభ్యర్థులు మూడు సెట్ల అటెస్టెడ్ అన్నీ సర్టిఫికెట్ కాపీలతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని కోరారు. వెరిఫికేషన్‌కు హాజరైనప్పుడు ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్, బి.ఎడ్, డి.ఎడ్, బి.పి.ఎడ్, పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్‌లతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, డిసేబుల్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం తీసుకొని రావాల్సిందిగా డీఈఓ కోరారు.
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ల ఇన్ సర్వీస్ పీజీ కోటాను 20 నుంచి 15 శాతానికి తగ్గించటం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కాలమాల రాహుల్, జనరల్ సెక్రటరీ షేక్ ఖాదర్ మస్తాన్ బి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుందర్ ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ నబి వలి, డాక్టర్ కుమార స్వామి తదితరులు పాల్గొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ టీ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చర్చల సందర్భంలో సర్వీస్ కోటాలో తగ్గించే ఉద్దేశం ఉంటే అసోసియేషన్ ప్రతినిధులతో చర్చిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించినదని అన్నారు. కేవలం ఏడు శాఖల్లో సర్వీస్ కోటా కాకుండా గతంలో మాదిరిగా అన్ని శాఖల్లో సర్వీస్ కోటా అమలయ్యేలా చూడాలని కోరారు. గిరిజన పల్లె ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వైద్యుల కేరీర్‌పై సర్వీస్ కోటా తగ్గింపు అశనిపాతంలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న 20 శాతం కోటాను యధావిధిగా అమలు చేయాలని విన్నవించారు.