
భార్యభర్తలను ఢీకొట్టిన లారీ
● భార్య మృతి
సంతమాగులూరు (అద్దంకి రూరల్): బైకుపై వెళ్తున్న భార్యభర్తలను వెనుకు నుంచి లారీ ఢీకొట్టటంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలంలోని రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. సంతమాగులూరు ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామా నికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య గద్దల కోటేశ్వరమ్మ (44) బైక్‌పై కొమ్మాలపాడు వైపు నుంచి సంతమాగులూరు వైపు వెళ్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. కోటేశ్వరమ్మకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.