
భూముల రీసర్వే తనిఖీ
జరుగుమల్లి (సింగరాయకొండ): మండలంలోని దావగూడూరు గ్రామంలో ఫేస్–3 లో భాగంగా జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని జేసీ గోపాలకృష్ణ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుత విధానంలో భాగంగా ప్రభుత్వ భూములు సర్వే చేస్తుండగా సర్వేలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రెవెన్యూ అధికారులకు వివరించారు. జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండలంలో ఫేస్–3 లో దావగూడూరు, కామేపల్లి, సతుకుపాడు, రామచంద్రాపురం, ఐఎస్ కండ్రిక, సాదువారిపాలెం, ఎన్‌ఎన్ కండ్రిక గ్రామాల్లో రీ సర్వే జరుగుతోందన్నారు. రీ సర్వేలో గ్రామం మొత్తానికి బౌండరీ నిర్ణయించి మొదట ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, డొంకలు గుర్తించి తరువాత దేవదాయ భూములను గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత పట్టా భూములను గుర్తిస్తామని వివరించారు.