
అమ్మానాన్నకు తెలియకుండా.. పోలీసులకు చిక్కకుండా..!
విలాసాలకు అలవాటు పడిన కొందరు యువకులు.. ఆదివారం, ఇతర సెలవు దినాలు రాగానే బైక్‌లపై షికారు చేసేందుకు, ఈత సరదా తీర్చుకునేందుకు పునుగోడు చేరుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రిజర్వాయర్ పరిసరాలను తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. చెరువులు, రిజర్వాయర్ల వద్ద కాపలాగా ఉండే లస్కర్ల వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. దీంతో సరదాగా చెరువులు, రిజర్వాయర్లలో దిగిన వారు ప్రమాదానికి గురైతే వారిని కాపాడే నాథుడు లేకుండాపోయాడు. దీంతో డ్రౌనింగ్ మృతుల సంఖ్య పెరుగుతోంది. రిజర్వాయర్ పరిసరాల్లో పోలీసుల నిఘా లేకపోవడం వల్లే అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.