
కనిగిరిలో ‘ఘన’నాథుడు
కనిగిరి రూరల్: వినాయక చవితి పండగకు కనిగిరిలో భారీ గణనాథుని కొలువుకు సిద్ధం చేశారు. ఈ మేరకు సుమారు రూ.5.50 లక్షల ఖరీదు చేసే వినాయకుని విగ్రహాన్ని హైదరాబాద్ దూల్‌పేట నుంచి ప్రత్యేక వాహనంలో కనిగిరికి శుక్రవారం తీసుకొచ్చారు. పట్టణంలోని 9వ వార్డులో వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ గణపతి విగ్రహానికి కనిగిరి హైవేలోని కొత్తూరు అభయాంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం మేళతాళాలతో వినాయకుని కొలువుదీర్చే మండపం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాల్మీకి యూత్, విగ్రహ కమిటీ నాయకులు మాట్లాడుతూ మహంకాళి అవతారంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరుతున్నట్లు తెలిపారు. సుమారు 26 అడుగుల ఎత్తు, తలపై నాలుగు అడుగుల నాగ పడగ, కిరీటం, 23 అండుగుల వెడల్పు, సుమారు 5 టన్నుల బరువు ఉంటుందన్నారు. బహుశా జిల్లాలోనే అత్యంత పెద్ద గణపతి విగ్రహం ఇదే అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.