పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

పనులు వేగవంతం చేయండి

Aug 22 2025 6:41 AM | Updated on Aug 22 2025 6:41 AM

పనులు

పనులు వేగవంతం చేయండి

పనులు వేగవంతం చేయండి ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు ‘న్యాయం చేస్తామని చెప్పారు’

ఒంగోలు సబర్బన్‌: ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక రామ్‌నగర్‌లోని విద్యుత్‌ భవన్‌లోని కాన్ఫరెన్స్‌లో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ముఖ్య పథకాలైన ఆర్డీఎస్‌ఎస్‌, పీఎం సూర్యఘర్‌ పురోగతి మీద ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అందించటంలో నిర్లక్ష్యం విడనాడాలన్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో ఎలాంటి ఆరోపణలు వచ్చినా సహించేది లేదన్నారు. పరివర్తకాల పనితీరు విషయంలో కూడా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్‌ శాఖపై ప్రజల అభిప్రాయం, విద్యుత్‌ కలెక్షన్లు, బకాయిలపై సమీక్షించారు. ప్రజలకు స్మార్ట్‌ మీటర్లు పట్ల ఉన్న అపోహలను తొలగించాలని, వాటి ఆవశ్యకతను తెలియజేయాలని సూచించారు. ఏపీ సీపీడీసీఎల్‌ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్‌, జిల్లా ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈఈ లు, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కొమరోలు : తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ బృందం ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లుగా కడప సబ్‌ కంట్రోల్‌ ఆర్‌ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. మండలంలోని గుంతపల్లె బీట్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ బృందం కూంబింగ్‌ చేపట్టింది. ఈ క్రమంలో ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తూ టాస్క్‌ఫోర్సు బృందాన్ని చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. విచారణలో గుంతపల్లె అటవీ ప్రాంతంలోని కల్వర్టు కింద 26 ఎర్రచందనం దుంగలను ఉంచినట్లుగా తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ బృందం 26 ఎర్రచందనం దుంగలను, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసుస్టేషన్‌కు తరలించినట్లుగా తెలిపారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఫారెస్టు ఆఫీసర్స్‌ అసోిసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు

మార్కాపురం: శ్రీశైల శిఖరం వద్ద అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసిన సంఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ జూనియర్‌ ఫారెస్టు ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. అసోషియేషన్‌ నాయకులతో కలిసి గురువారం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సందీప్‌ కృపాకర్‌కు వినతిపత్రం అందించి తమ సమస్యలు విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దాడి సంఘటనపై ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి వివరించామని, వారు స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అడవుల్లో క్రూరమృగాలు, విషసర్పాల మధ్య తాము విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమపై దాడి చేయడం బాధగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు మధ్య నల్లమల అటవీ ప్రాంతం ఉందని, దేశంలోనే పెద్ద టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు అని పులులను కాపాడేందుకు తాము కష్టపడుతున్నామన్నారు. అడవులో అభివృద్ధి పనులు చేయాలంటే నిబంధనల ప్రకారం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శశిభూషణ యాదవ్‌, మార్కాపురం యూనిట్‌ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, సుధాకర్‌, బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు.

పనులు వేగవంతం చేయండి 
1
1/2

పనులు వేగవంతం చేయండి

పనులు వేగవంతం చేయండి 
2
2/2

పనులు వేగవంతం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement