
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కనిగిరిరూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని చిన ఇర్లపాడుకు చెందిన ముద్దా మహేష్ (18) డీజే ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. సోమవారం సీఎస్‌పురం మండలంలోని కార్యక్రమానికి వెళ్లి రాత్రికి తిరిగి డీజే వాహనంలో వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని ఎన్ గొల్లపల్లి రోడ్డు మలుపు వద్ద జారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి