
పంట పొలాల్లో చిరుత సంచారం!
కంభం: మండలంలోని నడింపల్లి, ఎల్‌కోట మధ్యలో ఉన్న పంట పొలాల్లో మంగళవారం చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఔరంగబాద్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక ఏనుగుకొండ సమీపంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వద్దకు వెళ్లిన సమయంలో వారికి పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. రాత్రి ఫారెస్టు సిబ్బంది నడింపల్లి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసరాలను పరిశీలించిన ఫారెస్టు సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని రైతులకు, గ్రామస్తులకు సూచించారు. సుమారు మూడు గ్రామాలకు సమీపంలో ఉన్న పంట పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.