
కావాలనే పింఛన్ తీసేశారు
కావాలనే దర్శి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుడు దివ్యాంగ పింఛను తొలగించాడు. నాకు నడుముల దగ్గర నుంచి కాళ్లు సక్రమంగా పనిచేయవు. పదినిమిషాలు నిలబడలేను. పది నిమిషాలు కూర్చోలేను. ఎక్కువ సేపు పడుకున్నా శరీరమంతా నొప్పులే. అలాంటి నాకు దివ్యాంగుల పింఛను తీసేశారని ఇంటికి నోటీసు వచ్చింది. దర్శి వైద్యశాలకు వెళితే అసలు డాక్టరు కనీస పరీక్షలు కూడా చేయలేదు. మనిషిని చూసి వెళ్లిపొమ్మన్నాడు. చివరకు ఇంటికి దివ్యాంగ పింఛనుకు అనర్హుడవని నోటీసు మాత్రం వచ్చింది. ఇక నేను ఏవిధంగా జీవనం సాగించాలి అని ఆందోళన వ్యక్తం చేశాడు.
– వై.అంజిబాబు, తాళ్లూరు