
నా పింఛన్ తొలగించారు...
ఒక చేయి పూర్తిగా పనిచేయదు. గత పది సంవత్సరాలుగా దివ్యాంగుల పింఛను తీసుకుంటున్నాను. ఇటీవల దర్శి ప్రాథమిక వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ వైద్యుడు కనీసం నన్ను పరీక్ష కూడా చేయలేదు. కూర్చోబెట్టి అటూ ఇటూ తిరగమన్నాడు. అంతే లేచి వెళ్లిపొమ్మన్నాడు. తీరా ఇంటికి మాత్రం దివ్యాంగుల పింఛనుకు అనర్హుడవని నోటీసు వచ్చింది. అంటే పింఛను తొలగించినట్లేనా...సదరం సర్టిఫికెట్‌లో పర్సంటేజ్ తక్కువ ఉందని పింఛను తొలగించారు. ఆ పింఛను మీదనే ఆధారపడి జీవిస్తున్నాను.
– జీఆర్.కృష్ణారావు, తాళ్ళూరు