నీరున్నా నిష్ఫలం | - | Sakshi
Sakshi News home page

నీరున్నా నిష్ఫలం

Aug 18 2025 5:47 AM | Updated on Aug 18 2025 5:47 AM

నీరున

నీరున్నా నిష్ఫలం

నీరున్నా నిష్ఫలం

సాగర్‌ జలాలు సముద్రానికి సాగునీరు విడుదల చేయక ఆయకట్టుదారుల ఆందోళన జిల్లాకు సాగర్‌ జలాలు చేరి 20 రోజులు

త్రిపురాంతకం: కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతోంది. నదీ పరివాహంలోని జలాశయాలు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. అయినా సాగర్‌ రైతుల సాగునీటి కష్టాలు తీరే పరిస్థితులు కనిపించడంలేదు. సాగర్‌ జలాలు ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు విడుదల చేసినా నేటికీ మేజర్లకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో రైతాంగం మండిపడుతున్నారు. నాగార్జున సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి దాదాపు 20 రోజులు కావస్తోంది. జిల్లాలో గత నెల 30న సాగర్‌ జలాలు ప్రధాన కాలువ ద్వారా సరఫరా అయ్యాయి. ఒంగోలు రామతీర్థం జలాశయానికి నీరందించిన వెంటనే సాగునీరు విడుదల చేస్తారని రైతాంగం ఎదురు చూసినా అదిజరగలేదు. సాగర్‌ అధికారుల చుట్టూ రైతులు సాగునీటి విడుదల కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నీటి విడుదలపై ఎలాంటి నిర్థిష్టమైన ప్రకటన చేయలేదు. సాగునీటి విడుదలకు ఇంకా ఎన్నిరోజులు చూడాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

జలాశయాలు నిండాయి..

సాగర్‌ జలాలు సాగరానికి

కృష్ణానది పరివాహంలో ఉన్న ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. గత నెల నుంచి జలాశయాల్లోని నీటిని తగ్గించేందుకు పలు దఫాలు గేట్లు తెరచి దిగువకు విడుదల చేశారు. సాగర్‌ జలాలు సముద్రం పాలవడం తప్ప జలాశయాల ద్వారా సాగునీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారులను నీటి విడుదలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వృథాగా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని వినియోగించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. వృథా అవుతున్న నీటి ద్వారా సాగర్‌ పరివాహంలోని నోటిఫైడ్‌ చెరువులు, నాన్‌నోటిఫైడ్‌ చెరువులు, కుంటలు నింపితే కనీసం వాటి పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరు సమృద్ధిగా వచ్చేది.

సాగర్‌ జలాలు విడుదలై 20 రోజులు..

నారుకు నీరులేదు

సాగర్‌ జలాలు విడుదలై 20 రోజులు గడిచినా సాగుకు నీరందించకపోవడంతో రైతులు పంటలు వేసుకోవాలా లేదా అన్న అనుమానంతో ఉన్నారు. సాగునీరు లేక పోవడంతో సాగర్‌ కాలువల దిగువన నారుమళ్లు పోసుకునే పరిస్థితులు సన్నగిల్లాయి. కేవలం బోర్ల కింద అక్కడక్కడా నార్లు పోసుకునేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. సాగునీరు వీలున్నంత తొందరగా విడుదల చేస్తే నారుమళ్లు పోసుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు.

మైనర్‌ కాలువ ద్వారా నీరందక నారుకు నోచుకోని భూములు

సాగునీరు విడుదలకాని మేజర్‌ కాలువ

నీరున్నా నిష్ఫలం 1
1/2

నీరున్నా నిష్ఫలం

నీరున్నా నిష్ఫలం 2
2/2

నీరున్నా నిష్ఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement