
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్‌నకు విజయకుమార్ ఎ
దర్శి: పారా క్రీడల్లో ఒకటైన పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్–2025 పోటీలకు దర్శి పట్టణానికి చెందిన వేల్పుల విజయకుమార్ ఎంపికయ్యారు. అక్టోబర్ 8 నుంచి 18 వ తేదీ వరకు అమెరికాలో జరగబోయే పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ పోటీల్లో విజయ్‌కుమార్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పారా ఒలింపిక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారిక లేఖ అందినట్లు వేల్పుల విజయకుమార్ తెలిపారు. గతంలో 2023 లో కజకిస్థాన్ దేశంలో జరిగిన ఆసియన్ జోన్ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో భారతదేశం తరఫున విజయ్‌కుమార్ పాల్గొన్నారు. రెండోసారి భారతదేశం తరఫున ఆడటానికి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు.
మార్కాపురం: రాష్ట్రంలో మద్యం, మైనింగ్ మాఫియాల ఆగడాలను అరికట్టాలని ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షుడు మధిర రంగసాయిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురంలోని వారి కార్యాలయంలో దక్షిణ కోస్తా జిల్లాల ముఖ్యనాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు అందరూ ముందుకు రావాలని అన్నారు. రాజకీయ చైతన్యంతోనే రాజ్యాంగ ఫలాలు అన్నీ వర్గాలకు అందుతాయని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రజా సంకల్ప వేదికకు పునాదులు వేయాలన్నారు. మార్కాపురం మెడికల్ కాలేజీ శిథిలావస్థకు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ వర్గాల ప్రజలను ప్రజా సంకల్ప వేదికలోనికి ఆహ్వానించాలని రంగసాయిరెడ్డి సూచించారు.
సింగరాయకొండ: ఊళ్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పిల్లి హజరత్తయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈఓ కిరణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఎంఈఓ–1 కత్తి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల హజరత్తయ్యపై నకిలీ ధ్రువపత్రాలతో వ్యాయామ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావటంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా త్రీమెన్ కమిటీ వేసి విచారణ చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు రుజువుకావటంతో కలెక్టర్ ఆదేశాలతో హజరత్తయ్యను సస్పెండ్ చేసినట్లు వివరించారు.

పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్‌నకు విజయకుమార్ ఎ