
బొప్పాయి రైతు బేజారు
నష్టపరిహారం అందక ఆందోళన పశ్చిమ ప్రకాశంలో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న బొప్పాయి తోటలు ఆదుకోని కూటమి ప్రభుత్వం పెట్టుబడి కోసం కూడా తిప్పలుపడుతున్న రైతన్నలు
కొండారెడ్డిపల్లిలో కుప్పకూలిన బొప్పాయి తోటను పరిశీలిస్తున్న హెచ్‌ఓ, ఏఓ (ఫైల్)
తర్లుపాడు: శ్రమనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతన్నను ప్రకృతి కకావికలం చేయగా, ఆదుకుని అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ కొర్రీలు పెడుతోంది. దీంతో బొప్పాయి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత మే నెలలో పెనుగాలుల బీభత్సానికి పశ్చిమ ప్రకాశంలోని తర్లుపాడు, మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, కురిచేడు, బేస్తవారిపేట, కంభం తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన బొప్పాయి పంట నేలకూలింది. నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు నిరాశ నిస్పృహలు తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కానీ, నాలుగు నెలలైనా నష్టపరిహారం డబ్బులు అందకపోవడంతో రైతన్నలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ సహాయం అందితే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందని భావించినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.

బొప్పాయి రైతు బేజారు