
ఆటో ఢీకొని రెండు గేదెలు మృతి
నాగులుప్పలపాడు: ఆటో ఢీకొని రెండు గేదెలు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో నాగన్నవాగు చెక్ డ్యాం సమీపంలో జరిగింది. బాపట్ల జిల్లా పెదగంజాంకు చెందిన ఒకే కుటుంబం వారు ట్రాలీ ఆటోలో కామేపల్లి గుడికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. నాగన్నవాగు చెక్ డ్యాం వద్దకు వచ్చేసరికి చీకట్లో గేదెలు ఎదురురావడంతో కనిపించక ఆటో ఢీకొట్టింది. దాంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడి ఊపిరిపీల్చుకున్నారు.