
జాతీయ జెండాకు అవమానం
పొన్నలూరు: మండలంలోని కె.అగ్రహారం గ్రామంలో సచివాలయ సిబ్బంది నిర్వాకంతో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సచివాలయ భవనం వద్ద సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత జెండా తీసి భద్రపరచాల్సి ఉండగా, అలా చేయకుండా మర్చిపోయి వదిలేశారు. దీంతో శనివారం ఉదయం జెండా కిందపడిపోయి ఉంది. శనివారం కూడా కార్యాలయాలకు సెలవు కావడంతో సిబ్బంది విధులకు రాలేదు. దీంతో కిందపడిన జెండా మట్టిలో అలాగే ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస దేశభక్తి, బాధ్యత లేకుండా సచివాలయ సిబ్బంది వ్యవహరించడాన్ని విమర్శిస్తున్నారు.
కె.అగ్రహారంలో సచివాలయ సిబ్బంది నిర్వాకం
శుక్రవారం ఎగురవేసిన జెండాను తియ్యకుండా నిర్లక్ష్యం
కిందపడిన జాతీయ జెండా