హైదరాబాద్‌కు ఉదయం పూట బస్సు సౌకర్యం కల్పించాలి
మార్కాపురం బస్టాండులో ప్రయాణికుల సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. బస్టాండులో ప్లాట్‌ఫాంలను విస్తరించాలి. ఉదయం పూట 5 గంటలకు హైదరాబాద్‌కు, రాత్రిపూట విశాఖపట్నం, అన్నవరం, సింహాచలం, రాజమండ్రిలకు బస్సులు నడపాలి. ప్రస్తుతం శ్రీశైలం, తిరుపతి బస్సు పాత సర్వీసు కావడంతో బస్సులో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాలకు కొత్త సర్వీసులు ఏర్పాటు చేయాలి. బెంగళూరుకు ఇంద్ర బస్సు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ బస్టాండులో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి.
– ఆర్‌కేజే నరసింహం, జిల్లా ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు


