మా కారు ఎక్కండి... సున్నితంగా తిరస్కరించిన కలెక్టర్‌ అన్సారియా | - | Sakshi
Sakshi News home page

మా కారు ఎక్కండి... సున్నితంగా తిరస్కరించిన కలెక్టర్‌ అన్సారియా

Sep 25 2024 2:20 AM | Updated on Sep 25 2024 10:06 AM

-

కలెక్టర్‌ను కోరిన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల 

 

ఒంగోలు అర్బన్‌: సాధారణ విషయాలు మాట్లాడేందుకు కలెక్టర్‌ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మంగళవారం వచ్చి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా సాధారణ విష యాలు చర్చించేందుకు వచ్చామని దామచర్ల తెలిపారు. అయితే కలెక్టరేట్‌ నుంచి నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లేందుకు అప్పుడే కలెక్టర్‌ కూడా కారు వద్దకు వచ్చారు. 

దీంతో దామచర్ల తాను మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తున్నానని కలిసి వెళ్లేందుకు తన కారు ఎక్కాలని పదేపదే కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్‌ ఎమ్మెల్యే కారు ఎక్కబోయి కూడా వెనక్కు వెళ్లిపోయారు. మళ్లీ ఎమ్మెల్యే తన కారు ఎక్కాలంటూ కోరడంతో కలెక్టర్‌ సున్నితంగా తిరస్కరించి తన కారులో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బయలు దేరారు. జరిగిన సంఘటనను అక్కడే ఉన్న కూటమి నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement