వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు

Jun 12 2024 1:06 AM | Updated on Jun 12 2024 1:18 AM

వైఎస్

వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు

సింగరాయకొండ: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, ఏపీఎస్‌ ఆర్టీసీ నెల్లూరు జోన్‌ మాజీ చైర్మన్‌ బత్తుల సుప్రజరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్‌కు తమ సంఘీభావం తెలియజేసి, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజీనామా

యర్రగొండపాలెం: రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోలెబోయిన రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి రాజీనామా లేఖను పంపినట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, తనతోపాటు తన వర్గం వారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు 1
1/2

వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు

వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు 2
2/2

వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్టర్‌ బత్తుల దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement