వెంకటరామిరెడ్డిని సత్కరిస్తున్న నాయకులు
ఒంగోలు అర్బన్: డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. సివిల్ సప్లయిస్ విజిలెన్స్–1గా బీఎల్‌ఎన్ రాజకుమారిని నియమించారు. అదేవిధంగా మార్కాపురం భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఎస్‌డీసీగా ఉన్న ఆర్.శివరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
20 మంది తహసీల్దార్లకు పోస్టింగ్‌లు
ఒంగోలు అర్బన్: బదిలీపై జిల్లాకు వచ్చిన 20 మంది తహసీల్దార్లకు కలెక్టర్ దినేష్‌కుమార్ పోస్టులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ అడ్మిన్ సూపరింటెండెంట్‌గా శ్రీకాంత్ కేదార్‌నాథ్, కలెక్టరేట్ ఎంఏజీఎల్ సూపరింటెండెంట్‌గా వి.లావణ్య, కో ఆర్డినేషన్ సూపరింటెండెంట్‌గా డి.మల్లికార్జునరావు, ల్యాండ్–1 సూపరింటెండెంట్‌గా ఎం నాగిరెడ్డి, తహసీల్దార్లుగా గిద్దలూరు ఎం సుజన్‌కుమార్, ఒంగోలు అర్బన్ కె.రవికుమార్, మార్కాపురం బి.సోమ్లానాయక్, యర్రగొండపాలెం జి.సిద్దార్ధ్, చీమకుర్తి జి.రమేష్‌కుమార్, దర్శి జి.సుజాత, కంభం ఎస్ రామయ్య, పొన్నలూరు ఎంవీఎస్ సుధాకర్‌రావు, ఒంగోలు ఆర్‌డీఓ కేఆర్‌సీసీ పి.అనురాధ, ఒంగోలు రూరల్ ఎం డేనియేల్, దోర్నాల కె. దాసు, సింగరాయకొండ జె.ప్రసాదరావు, బేస్తవారిపేట డి.పద్మనాభుడు, టంగుటూరు వైవీబీ కుటుంబరావు, సీఎస్‌పురం ఎస్‌కే నాగూల్‌మీరా, ఎన్‌జీపాడు బి.పద్మావతిలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజలను మోసగించిన బీజేపీని ఓడించాలి
ఒంగోలు టౌన్: దేశ ప్రజలను అన్నీ విధాలుగా మోసగించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారవు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఆచార్య రంగ భవన్‌లో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని రైతాంగ, కార్మిక, ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. రైతుల రుణమాఫీ ఉపశమన చట్టం, ఆహార భద్రత చట్టాలను తీసుకొని రావాలని ఆచార్య రంగా కిసాన్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య డిమాండ్ చేశారు. జామాయిల్, సుబాబుల్, సరుగుడు కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే హనుమారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలో 44 కార్మిక చట్టాలను అమలులోకి తీసుకొని రావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు కోరారు. సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు, అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా నాయకురాలు రమాదేవి, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల డీఏ పెంపు హర్షణీయం
ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో వీఆర్‌ఏల డీఏ రూ.500కు పెంచుతూ ప్రభుత్వం మంజూరు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకు చెందిన వీఆర్‌ఏల ఐక్య సంఘం నాయకులు చైర్మన్‌తో పాటు ప్రధాన కార్యదర్శి అరవపాల్‌కు విజయవాడలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. వీఆర్‌ఏల డీఏ పెంపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో వీఆర్‌ఏ సంఘం నాయకులు మర్రి వెంకటేశ్వర్లు, యాదాల రాజు, షేక్ చాన్‌బాష, తలారి శేఖర్, జానీ బాష, సూర్యనారాయణ, నాగేశ్వరరావు, మీసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రసంగిస్తున్న రైతు నాయకుడు చుండూరి రంగారావు


