మార్మోగిన జగన్‌ నినాదం | - | Sakshi
Sakshi News home page

మార్మోగిన జగన్‌ నినాదం

Oct 14 2023 1:56 AM | Updated on Oct 14 2023 10:47 AM

విద్యార్థినులతో వైఎస్‌ విజయమ్మ - Sakshi

విద్యార్థినులతో వైఎస్‌ విజయమ్మ

ఒంగోలు: జై జగన్‌ అంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒంగోలులోని పవిత్ర కాలేజీ క్యాంపస్‌ మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు వచ్చారు. స్థానిక పవిత్ర క్యాంపస్‌ (శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీ బాలికల క్యాంపస్‌) ఎదురుగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడి బయటకు వస్తుండగా క్యాంపస్‌లో ఉన్న విద్యార్థినులు ఒక్కసారిగా బయటకు వచ్చారు.

సిబ్బంది అదుపు చేస్తున్నా విద్యార్థినులు ససేమిరా అన్నారు. ఒక్కసారిగా వారందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. వారి ఉత్సాహాన్ని చూసిన విజయమ్మ విద్యార్థినులను దగ్గరకు తీసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. జై జగన్‌ అంటూ విద్యార్థినులు నినదిస్తూ ఆమెను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆమెకు షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement