
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విశాఖపట్నం ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఎందుకు యాత్ర చేస్తున్నాడో ఆయనకే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.
కాగా, వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. పవన్.. ప్రజలకు ఉపయోగపడే ప్రయత్నం చేస్తే వారు పట్టించుకునేవారు అనుకుంటాను. ఏపీ అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా?. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఏడాది కాలంలో భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట ఎయిర్‌పోర్టు, రహేజా మాల్ నిర్మాణ పనులు టీడీపీ నేతలకు కనిపించడం లేదా?.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపని చేసినా శిలాఫలకంవేసి వదిలేశారు. కానీ, నిర్ణీత కాలంలో ప్రతీ పని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తారు. విశాఖ అభివృద్ధితో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల విషయంపై కూడా అధికారులతో చర్చించినట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో త్వరలో కొత్త జోన్లు.. రాష్ట్రపతి ఉత్తర్వులపై సీఎస్ సమీక్ష