
Yuvatha Poru Updates..
👉ఏపీలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు.
యువత పోరును అడ్డుకున్న పోలీసులు..
- విజయవాడలో యువత పోరుకు అడ్డంకులు.
- వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.
- యవత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు.
- వైఎస్సార్‌సీపీ నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.
- ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు ఏర్పాటు.
కృష్ణాజిల్లా..
- కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్
- మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్..
- చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేశారు
- పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను, ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
- మీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ.. విద్యార్ధుల ఫీజులకు డబ్బులుండవా?.
- చంద్రబాబు, పవన్, లోకేష్‌కు పదేసి కార్లలో తిరగడానికి.. వాటి సిబ్బందికి డబ్బులుంటాయి
- పిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదా
- ఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది
- అరెస్టులతో మమ్మల్ని అడ్డుకోలేరు
- అరెస్టులు చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనకడుగువేసేది లేదు
శ్రీకాకుళం..
- యువత పోరు కార్యక్రమానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
- జిల్లా కేంద్రానికి వస్తున్న ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, నేతలను అడ్డుకున్న పోలీసులు.
- రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు
- చింతాడ వద్ద పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం
- అనంతరం, వైఎస్సార్‌సీపీ నేతలకు అడ్డుతప్పుకున్న పోలీసులు.
విశాఖలో ఉద్రిక్తత..
- విశాఖ జిల్లా కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
- కలెక్టరేట్‌లోకి వైఎస్సార్‌సీపీ శ్రేణులను అనుమతించని పోలీసులు..
- కేవలం పది మందికి మాత్రమే కలెక్టర్‌ని కలిసేందుకు అనుమతి..
- గేటు బయట పోలీసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..
- జై జగన్ నినాదాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరెట్
విజయవాడ..
- రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- పునూరు గౌతమ్ రెడ్డి కామెంట్స్
- విద్యార్థులకు ఫీజులు వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది
- చంద్రబాబు 7100 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ప్రజలను మోసం చేశారు
- గతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ 18వేల కోట్లు విడుదల చేశారు
- చంద్రబాబు అరకొర నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడు
- విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు తక్షణమే అందించాలి
ఢిల్లీ..
- పార్లమెంట్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
- వేడుకల్లో పాల్గొన్న ఎంపీలు వైవీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, గొల్ల బాబురావు, అయోధ్య రామిరెడ్డి,
- వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..
- వైఎస్సార్ ఆశయ సాధన మా పార్టీ ధ్యేయం
- పేదల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసింది
- పేదల పక్షాన నాడు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేశాం
- ప్రజలకు అండగా నిలబడ్డాం.
విశాఖ..
- వైఎస్సార్‌సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..
- జెడ్పీ జంక్షన్‌కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
- కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటున్న పోలీసులు..
- ఆంక్షలు అమలు కోసం భారీగా పోలీసుల మోహరింపు..
- ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్దమైన వైఎస్సార్‌సీపీ నేతలు.
తిరుపతి..
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..
- వైఎస్సార్‌సీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోంది
- ఎన్నో ఆశలు పెట్టుకొని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకువచ్చారు
- వైఎస్ జగన్ పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంపిణీ చేశారు
- పిల్లలు అందరూ కాలేజీలకు వెళ్లకుండా పంట పొలాలకు వెళ్తున్నారు
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు కొనసాగిస్తున్నాము
- యువతకు 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు
- ప్రతి విద్యార్థికి పది నెలల్లో ముప్పై వేలు ఇవ్వాలి
- మహిళా సంఘాలు అక్కౌంట్ లు 50శాతం నిర్వీర్యం అయిపోయాయి
- ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోంది.
- దీని పర్యవసానం చెల్లించక తప్పదు
- యువత పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
నెల్లూరు..
- వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించిన కాకాణి.
- హాజరైన అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జులు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు
- మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..
- ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ఇది.
- ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు.
- కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. విలువలు విశ్వసనీయంతో ఐదేళ్లు జగన్ ప్రభుత్వాన్ని నడిపారు
- పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా వాడవాడలా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్ జగన్.
- వైఎస్ జగన్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది.
- వైఎస్ జగన్ రూపం రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది.
- పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజల స్వచ్ఛందంగా హాజరవుతున్నారు..
- యువత పోరుకు సైతం భారీ సంఖ్యలో హాజరుకావాలి.
కృష్ణాజిల్లా..
- పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం.
- కానూరు నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ.
- దేవభక్తుని కామెంట్స్..
- కూటమి యువతను, విద్యార్థులను మోసం చేసింది.
- విద్య, వైద్యంపై ఉక్కు పాదం మోపుతుంది.
- విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- ఫీజు కట్టే స్తోమత లేక పొలం పనులకు యువత వెళ్తున్నారు.
- విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- జగనన్న హయాంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాం.
- దున్నపోతు మీద వర్షం పడినట్లు ప్రవర్తిస్తుంది.
- ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది.
అనంతపురం..
- వైఎస్సార్‌సీపీ యువత పోరుకు భారీ స్పందన
- జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ
- చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు
- యువత పోరులో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు
- మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ,
- మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ,
- వై.శివరామిరెడ్డి, ప్రభుత్వ విద్య మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment