సామాజిక సాధికార బస్సు యాత్ర.. తొమ్మిదోరోజు షెడ్యూల్‌ ఇదే

YSRCP Samajika Sadhikara Bus Yatra Nov 6th Schedule - Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది.  నేటి(సోమవారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర గాజువాక, కాకినాడ రూరల్‌, మార్కాపురం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. గాజువాక సెంటర్‌లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపం వద్ద వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది.

గం. 1.30 ని.లకు మింది గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు.

ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభం కానుంది.  రెండు గంటలకు వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉండగా, మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. పిల్లల పార్క్‌ మీదుగా కంభం సెంటర్‌వరకూ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం గం. 4.30ని.లకు వైఎస్సార్‌ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొననున్నారు.

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మిథున్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top