విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్సార్‌సీపీ | YSRCP Responds To Vijayasai Reddy Resignation | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్సార్‌సీపీ

Jan 25 2025 8:13 PM | Updated on Jan 25 2025 8:23 PM

YSRCP Responds To Vijayasai Reddy Resignation

విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము.

సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. ‘‘మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుండి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము’’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

‘‘హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement