ఈనెల 16న విశాఖలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన సభ | YSRCP to Organize Uttarandhra BC Garjana in Vizag on 16th | Sakshi
Sakshi News home page

ఈనెల 16న విశాఖలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన సభ

Oct 8 2026 3:14 PM | Updated on Oct 8 2026 3:25 PM

YSRCP to Organize Uttarandhra BC Garjana in Vizag on 16th

సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో బీసీల గొంతుకను వినిపించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన విశాఖలో ప్రతి ష్టాత్మకంగా ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా ప్రధానంగా రెండు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ వర్గాలను చేస్తున్న మోసాలు, వంచనలను ప్రజల ముందుంచనున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, భౌతిక దాడులపై ఈ వేదిక ద్వారా తీవ్రంగా గళమెత్తనున్నారు. ఈ గర్జన సభ ద్వారా బీసీ వర్గాలకు అండగా నిలుస్తూ, వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను వైఎస్సార్‌సీపీ ప్రకటించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : ‘స్థితప్రజ్ఞుడు’ వైఎస్ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement