బాబు బ్యాండ్‌ మేళం ప్రచారం మళ్లీ మొదలు: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On CBN And Yellow Media | Sakshi
Sakshi News home page

బాబు బ్యాండ్‌ మేళం ప్రచారం మళ్లీ మొదలు: విజయసాయిరెడ్డి

Nov 13 2024 1:40 PM | Updated on Nov 13 2024 3:30 PM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On CBN And Yellow Media

సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు పాలనపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే, గతంలలో మాదిరిగానే అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు, అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు అంటూ కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మధ్య కాలంలో ఎల్లో పత్రికల నిండా  వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతిని సింగపూర్‌లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, భాజాబజంత్రీలతో హడావిడి చేశారు. చివరికి 2019 ఎన్నికల చివరి నాటికి పెట్టుబడులు, అభివృద్ధి శూన్యం. మరి ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది..

ఇప్పుడు మళ్లీ అదే మొదలైంది. 
అవే యెల్లో పత్రికలు.. 
అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు...
అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు...
ఇవేవీ వాస్తవరూపం దాల్చవు. యెల్లో మీడియా గ్రాఫిక్స్‌లో మాత్రమే ఉంటాయి. 
అందుకే అనేది చంద్రబాబువి ఉత్తిత్తి బ్యాండ్ ప్రచారాలు అని అంటూ సెటైర్లు వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement