గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయాల్సిన చైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డితో పాటు ముఖ్య నేతలు యనుమల మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లులను గురజాల టౌన్ సీఐ మురళీ మాట్లాడాలి అని చెప్పి పిలిపించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ బయట నుంచే ఒక ప్రైవేట్ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ కుట్రకు పాల్పడ్డారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తక్షణమే అక్రమంగా నిర్బంధించిన నేతలను విడుదల చేసి, నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


