సాక్షి,తిరుపతి : చంద్రబాబు,లోకేష్ డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నిక నామినేషన్ సమయంలో టీడీపీ గూండాలు జరిపిన దాడులపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బయటి నుంచి గూండాలను తెప్పించి విధ్వంసం సృష్టించారు. మా కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయించారు. వాహనాలు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. టీడీపీకి గెలిచే సత్తాలేదు. అడ్డదారిలో గెలిపించుకునేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదు. మాపై ఒత్తిడి ఉంది. తీసుకోలేమని అంటున్నారు.దమ్ముంటే నిజాయితీగా ఎన్నికలకు వెళ్లాలి’అని సవాల్ విసిరారు.


