ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Condemns Attack on MP Mithun Reddy Slams CBN Over Violence | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

Oct 16 2026 1:34 PM | Updated on Oct 16 2026 3:17 PM

YS Jagan Condemns Attack on MP Mithun Reddy Slams CBN Over Violence

సాక్షి, గుంటూరు: పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకి ఏమాత్రం లేదన్న ఆయన.. తీవ్ర ప్రజా వ్యతిరేకత నడుమ ఓడిపోతారనే తెలిసే దాడులను ప్రొత్సహిస్తున్నారని అన్నారు. పుంగనూరుతో పాటు రాయచోటిలో ఇవాళ జరిగిన టీడీపీ రాక్షస క్రీడ గురించి ఆయన పార్టీ వర్గాల నుంచి ఆరా తీశారు.

‘‘హింసా రాజకీయాలు చంద్రబాబుకి కొత్త కాదు. రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చారు. ఒక ఎంపీ.. అందునా ఓ పార్టీ లోక్‌సభా పక్ష నేతకే భద్రతా లేకుండా పోయిన పరిస్థితులు చూస్తున్నాం. రెండున్నరేళ్ల కూటమి పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే అరాచకాలకు, దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులను వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అక్రమాలు చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘‘దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కూటమి అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం. న్యాయ, చట్టపరంగా పోరాడతాం. ధైర్యం సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటాం. రాష్ట్రంలో పరిస్థితుల్ని కోర్టులకు తెలియజేస్తాం. కేంద్ర బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయి. ఇదే విషయం కోర్టు ముందు ఉంచుతాం. ప్రజలకు మంచి చేసిన చరిత్ర మాది. హిసంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చరిత్ర చంద్రబాబుది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ ఎంపీ మిథున్‌రెడ్డిని ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. జరిగిందంతా అడిగి తెలుసుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ శుక్రవారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలతో పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది.

పుంగనూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వెంట ఉన్న పార్టీ నాయకులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అనంతరం రాళ్లు, కర్రలతో దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో మిథున్‌రెడ్డికి, ఆయన గన్‌మెన్లకు కూడా గాయాలయ్యాయి.

దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని వాహనాలకు నిప్పంటించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు మిథున్‌రెడ్డిని నామినేషన్‌ కేంద్రంలోని ప్రత్యేక గదికి తరలించారు. అయితే నామినేషన్లు స్వీకరించేంత వరకు అక్కడి నుంచి కదలనని ఆయన భీష్మించుకుని కూర్చుకున్నారు. 

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

ఇటు రాయచోటిలోనూ వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ను టీడీపీ గూండాలు తగలబెట్టారు. పలు వాహనాలకు ధ్వంసం చేశారు. ఆ దాడి నుంచి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ సురక్షితంగా బయటపడ్డారు. పుంగనూరు, రాయచోటి ఘటనలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్లు వేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పార్టీ నేతలు విమర్శించారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి👉: ఏపీలో పచ్చ మూకల బరితెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement