విశాఖ: స్థానిక ఎన్నికలకు నామినేషన్లు వేసే ప్రక్రియలో తమ నేతలను అడ్డుకోవడం చూస్తే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడుతున్నారనే విషయం అర్థమవుతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా దాడులు చేస్తున్నారని, చంద్రబాబు బెదిరింపులకు తామెవరూ భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే గెలుపు ఎవరిదో తెలుస్తుందన్నారు.
ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 16) విశాఖ నుంచి మీడియాతో మాట్లాడిన కురసాల.. ‘విశాఖ మేయర్ స్థానం జనరల్ మహిళకు వస్తే బీసీ మహిళకు వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. గతంలో బీసీ జనరల్ వస్తే బీసీ మహిళకు మేయర్ గా అవకాశం కల్పించారు. సేవ్ విశాఖ పేరుతో ఎన్నికలకు వెళ్తాము. విశాఖ అభివృద్ధికి సంబంధించిన మానిఫెస్టో విడుదల చేస్తాము. కూటమి నేతలు సింహాచలం కొండలను దోచేస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి మంచి నీళ్ళు ఇస్తున్నారు. టీడీపీ ఇప్పటికీ అభ్యర్ధిని ప్రకటించలేక పోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు కురసాల కన్నబాబు.
ఇదీ చదవండి: కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. తలలు పట్టుకుంటున్న నేతలు


