కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్‌ | andhra pradesh Rebellion in Coalition Over Local Body Election Tickets | Sakshi
Sakshi News home page

కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. తలలు పట్టుకుంటున్న నేతలు

Oct 16 2026 3:56 PM | Updated on Oct 16 2026 4:47 PM

andhra pradesh Rebellion in Coalition Over Local Body Election Tickets

సాక్షి,అమరావతి : కూటమిలో స్థానిక సంస్థల ఎన్నికలు కుంపట్లు రాజేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు మున్సిపల్ స్థానాల్లో పోటీ చేసేందుకు కూటమిలోని ఆశావాహులు పోటీపడుతున్నారు. అయితే, అధిష్ఠానం కొందరికే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆశావహులు, రెబల్ అభ్యర్థులు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. తాము బరిలో దిగాలనుకుంటున్న స్థానాల్లో ఇతరులను ఎలా అభ్యర్థులుగా ప్రకటిస్తారంటూ నేతలు అధిష్ఠానాన్ని నిలదీస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా

  • సాలూరు మున్సిపల్ స్థానాన్ని కూటమి నేతలు జనసేనకు కేటాయింపు

  • టీడీపీ నిర్ణయంపై తిరగబడ్డ కార్యకర్తలు

  • మంత్రి అచ్చం నాయుడు, గుమ్మడి సంధ్యారాణిలు ఎదుట వాగ్వాదం

  • జనసేనకు సహకరించేదే లేదని హెచ్చరికలు జారీ చేసిన టీడీపీ కార్యకర్తలు  

  • అధిష్టానం నిర్ణయం మేరకు సర్ధుకు పోవాల్సిందేనన్న మంత్రి అచ్చం నాయుడు

ఏలూరు

  • టీడీపీలో రచ్చకెక్కిన మేయర్ సీటు వివాదం

  • తమ నేతకే మేయర్‌ సీటు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన  

  • టీడీపీ కార్యాలయం వద్ద నిరసన  

  • టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పార్లమెంట్ పరిశీలకురాలు పంచుమర్తి అనురాధ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

  • తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే బడేటి చంటితో అనురాధ, చింతమనేని భేటీ

  • అధిష్టానం నిర్ణయాన్ని చెప్పి కేడర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం 

అనకాపల్లి  

  • అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్న పాత్రుడికి షాక్‌ 
  • యలమంచిలి మున్సిపాలిటీలో జనసేన,బీజేపీ మధ్య రాజుకున్న వివాదం
  • పొత్తులో భాగంగా యలమంచిలి మున్సిపాలిటీ బీజేపీ కేటాయింపు
  • జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన కర్రీ ఝాన్సీ  
  • రేపు బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు పిల్ల రమా కుమారి
  • జనసేన మిత్ర ధర్మం పాటించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
  • బీజేపీకి ఇచ్చిన స్థానంలో జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేయడంపై అసంతృప్తి  
  • జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ సూచన మేరకే కర్రి ఝాన్సీ నామినేషన్ దాఖలు  

కాకినాడ 

  • పెద్దాపురం  కూటమీలో మరోసారి రాజుకున్న కుంపట్లు  
  • సామర్లకోట మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయింపు
  • సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవి ఆశించిన టీడీపీ దళిత నేత తాతపూడి కృష్ణబాబు
  • జనసేనకు సీటు కేటాయించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన కృష్ణబాబు అనుచరులు
  • పోస్టాఫీసు సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా
  • ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్త
  • 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తే దళితులకు పార్టీ ఇచ్చిన గౌరవరం ఇదేనా అంటూ రగిలిపోయిన కృష్ణబాబు

పిఠాపురం

  • పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు టీడీపీ షాక్
  • పొత్తులో భాగంగా గొల్లప్రోలు నగర పంచాయితీ జనసేనకు కేటాయింపు 
  • జనసేనకు గొల్లప్రోలు కేటాయించడంపై టీడీపీ నేతల ఆగ్రహం
  • గొల్లప్రోలు నగర పంచాయితీలో ఉన్న 23 వార్డుల నుండి బరిలోకి టీడీపీ అభ్యర్ధులు.
  • నగర పంచాయితీ ఎన్నికల్లో అన్ని వార్డుల నుండి నామినేషన్లు  ప్రకటించిన గొల్లప్రోలు టీడీపీ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు

పశ్చిమగోదావరి జిల్లా

  • తాడేపల్లిగూడెం చైర్మన్ సీటు కోసం రాజుకున్న వర్గ పోరు 
  • చైర్మన్ సీటు తమ పార్టీకి కేటాయించాలని టీడీపీ నేతలు ఆందోళన 
  • తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం
  • టీడీపీ నాయుకులు గొర్రెల శ్రీధర్‌కి చైర్మన్ సీటు ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం
     

కర్నూలు

  • కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టిన మునిసిపల్ చైర్మన్ సీటుచైర్మన్ సీటు జనసేన పార్టీకే అంటూ మొదటి నుండి ప్రచారం
  • మొదటి నుండి సీటు మీకే అని చెప్పి టిడిపి పార్టీకి  కేటాయించడంపై  బగ్గుమంటున్న జనసేన అభ్యర్థి
  • ఆదోనిలో జనసేన పార్టీ ఇన్ ఛార్జి భార్య స్వప్న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు.
  • చైర్మన్ సీటు కేటాయింపులో మోసం చేశారంటూ ఆరోపించిన స్వప్న 
  • 2008లో ప్రజారాజ్యం పార్టీలో 2019 గాని టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు 
  • 2024లో కూడా మాకు అన్యాయం జరిగిందంటూ వాపోయిన స్వప్న 
  • అసంతృప్తిలో కార్యకర్తలు.. ఇండిపెండెంట్‌గా స్వప్న పోటీ 
     

విజయనగరం జిల్లా 

  • నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ స్థానం బీజేపీకి కేటాయించిన కూటమి అధిష్టానం  
  • చైర్మన్ టికెట్ ఆశించిన లెంక అప్పలనాయుడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు 
  • ససేమెరా అంటూ.. పరిశీలకు రాలు పంచమి అనురాధ.. ఎమ్మెల్యే చంటిని నిలదీసిన టిడిపి కార్యకర్తలు
  • టీడీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement