అభివృద్ధిని కళ్లు తెరిచి చూడండి..

YSRCP Leader Malla Vijaya Prasad Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత మళ్ల విజయ ప్రసాద్

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇష్టం లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి మళ్ల విజయ ప్రసాద్ మండిపడ్డారు. విశాఖ రాజధాని అవసరం లేదని చంద్రబాబు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గ్రేటర్ విశాఖ పరిధిలోని 90వ వార్డు గవర వీధి స్కూల్, 91వ వార్డు గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. (చదవండి: బాగున్నావా కేకే.. సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు)

అనంతరం విజయ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరు నచ్చకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోంది. ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేసేవాళ్లు.. అభివృద్ధిని కళ్లు తెరిచి చూడాలన్నారు. ప్రతి నెలా తెల్లవారక ముందే ఇంటింటా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ‘జగనన్న విద్యాకానుక’ అందిస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోందని మళ్ల విజయ ప్రసాద్‌ తెలిపారు. (చదవండి: ఇది మీ మేనమామ ప్రభుత్వం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top