బాగున్నావా కేకే.. సీఎం జగన్ ఆత్మీయ పలకరింపు

సాక్షి, విశాఖపట్నం : ‘కేకే.. హౌ ఆర్ యూ.. అంతా ఓకే కదా...’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుని ఆప్యాయంగా పలకరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో గురువారం నిర్వహించిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కేకే రాజు ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. ఈ సందర్భంగా కేకే రాజుని సీఎం ఆత్మీయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేశారు. కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. (ఇది మీ మేనమామ ప్రభుత్వం)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి