ఓ‍టమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్‌ | YSRCP Gudivada Amarnath Satirical Comments On TDP Leaders | Sakshi
Sakshi News home page

ఓ‍టమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్‌

Mar 4 2025 11:53 AM | Updated on Mar 4 2025 12:43 PM

YSRCP Gudivada Amarnath Satirical Comments On TDP Leaders

సాక్షి, విశాఖ: ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు లేదా?. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక  ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు మంత్రిగా సీఎం కుమారుడు లోకేష్ ఉన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు.

ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్‌కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఎన్నికల్లో ఎప్పుడూ శ్రీనివాసుల నాయుడు తమ అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. బాబాయి ఏమో.. శ్రీనివాసుల నాయుడు అంటున్నారు.. అబ్బాయి ఏమో.. రఘు వర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు.

కూటమి పాలనలో రిషికొండ బీచ్‌కు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్లూప్లాగ్‌ను బీచ్‌లో నుంచి తొలగించారు. ప్రభుత్వం చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంది అని చెప్పుకొచ్చారు. 

ఎన్నికలకు ముందు మావోడు.. ఓడిపోయాక పరాయివాడా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement