టన్నెల్‌ పనుల్లో కూలీల మృతి బాధాకరం

YS Sharmila: Congress Leader Rama Goud Joined In YSRTP Party - Sakshi

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల   

సాక్షి, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరుగుతున్న టన్నెల్‌ పనుల్లో ఐదుగురు కూలీలు మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. కాంట్రాక్టు సంస్థ సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు.

ఈ ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు రాము గౌడ్‌ షర్మిల సమక్షంలో తన అనుచరులతో కలసి వైఎస్సార్‌టీపీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top