సంపద సృష్టించడం అంటే ఇది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Satires On Chandrababu Sampada Srusti | Sakshi
Sakshi News home page

సంపద సృష్టించడం అంటే ఇది: వైఎస్‌ జగన్‌

Published Thu, Nov 28 2024 4:38 PM | Last Updated on Thu, Nov 28 2024 7:36 PM

YS Jagan Satires On Chandrababu Sampada Srusti

గుంటూరు, సాక్షి: ఒక రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా.. ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారు.  రాష్ట్ర పురోగతిని.. భవిష్యత్తులో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే.. అది సంపద సృష్టి’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

‘‘ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగింది. మూడు కొత్త పోర్టులు.. అదీ నిర్మాణం వేగంగా సాగింది. దాదాపుగా పూర్తి కావొచ్చిన వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. మెడికల్‌ కాలేజీల వస్తే ఖర్చులు తగ్గుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో.. సంపద సృష్టి జరుగుతుంది. ఈ పోర్టులు, మెడికల కాలేజీలు భవిష్యత్తు సంపద. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయాలి’’ అంటూ చంద్రబాబుకు సూచనలు చేశారు వైఎస్‌ జగన్‌.

Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams

‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్‌లో కేలండర్‌ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement