
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు.
జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..
మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?
వైఎస్ జగన్: ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోరతాం.
ఎన్నికల నాటికి.. లెక్కింపు నాటికి 12.5 శాతం ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి.. ఎలా?. ఓట్ల చోరీ అంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ.. ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లో ఉంది. రాహుల్ గాంధీ చంద్రబాబుతో హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారు. కాబట్టే ఏపీ గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ చంద్రబాబు గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. నా గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు.
చంద్రబాబుకి వార్నింగ్
ఏడాదిన్నర ఇప్పటికే గడిచిపోయింది
కళ్లు మూసుకుని తెరిచేలోపు మూడున్నరేళ్లు గడిచిపోతుంది
కొద్దోగొప్పో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్లకు నా విన్నపం
ప్రజాస్వామ్యం కాపాడుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు పుడతాయి.. అది గుర్తించాలి
తప్పుడు పనులకు పునాదులు వేయొద్దు చంద్రబాబు
తప్పులు, దుర్మార్గాలు.. రేపు వృక్షంగా మారతాయి
మీరు చేసే ప్రతీ పని, ప్రతీ తప్పు మీకు చుట్టుకుంటుంది
చంద్రబాబు జీవితానికి ఇదే ఆఖరికి ఎన్నికలు కావొచ్చు
కృష్ణా, రామా అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది
ఇకనైనా మారితే మంచిది
ఇలాగే ఉంటే.. భవిష్యత్తులో టీడీపీకి డిపాజిట్ కూడా రాదు
వైఎస్సార్‌సీపీ వాళ్లే లక్ష్యంగా..
టీడీపీ వాళ్లు వందలమంది ఉన్న పోలీసులు పట్టించుకోలేదు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయి
వైఎస్సార్‌సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారు
అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు
పులివెందుల టౌన్‌లో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు
తన ఇంట్లో ఉన్న అవినాష్‌ను ఉదయం 4గం.కే అరెస్ట్ చేశారు
ఎర్రబలిల్లో బూత్‌లోకి ఓటర్లను రానీయలేదు
రిగ్గింగ్ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారు
వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం తరిమి తరిమి కొట్టారు
తమ ఊరిలో తమను ఓటు వేయనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు
ఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు
ఓటుకు వెళ్తుంటే బూత్‌ల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ మరికొందరు ధర్నాలు చేశారు
ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు
పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!
ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు
డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి
కోయ ప్రవీణ్.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువు
పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయి
టీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్ అధికారులకు తప్పని వేధింపులు
బాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే!

ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారు
మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే రిగ్గింగ్ జరిగింది
మంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వచ్చారు
జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డికి తీసుకొచ్చారు
ఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారు
బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు
పోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారు
పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారు
ఒక్కో ఓటర్ కోసం బయటి నుంచి వచ్చిన ఒక్కో రౌడీ
ప్రతీ పోలింగ్‌బూత్‌కు 400 మందిని మోహరించారు
పోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారు
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారు
స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?
ఆఖరికి ఇవాళ రెండు కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్‌లోనూ దొంగ ఓట్లే
ఈ సందర్భంగా.. క్యూ లైన్‌లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్ జగన్ చదివి వినిపించారు
పోలింగ్ బూత్‌లను మార్చేశారు
పోలింగ్ బూత్‌లను ఇష్టానుసారంగా మార్చేశారు
ఒక ఊరివాళ్లు.. మరో ఊరికి వెళ్లి మరీ ఓటేయాలట
సొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాలకు వెళ్లి ఓటేయాలా?
ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఎన్నిక నిర్వహించారు
పోలింగ్‌బూత్ ఆవరణలో సీసీటీవీ ఫుటేజీలు ఇచ్చే ధైర్యముందా?
ప్రతిబూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఇచ్చే దమ్ముందా?
అసలు పులివెందులలో జరిగింది ఎన్నికే అంటారా?
ఏపీలో ప్రజాస్వామ్యం కనబడడం లేదు
రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇంత హింస జరగలేదు
బందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక జరిపించారు
చంబల్ లోయ బందిపోట్లను మరిపించేలా ఎల్లో బ్యాచ్ ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడింది
ఈ బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబే
చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం
చంద్రబాబుది రాక్షస పాలన
ఆయనొక మాబ్‌స్టర్, ఫ్రాడ్‌స్టర్
చంద్రబాబుకి తన పాలనపై నమ్మకం ఉంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా, కేంద్ర బలగాలతో ఎన్నిక జరిపించండి
పోలింగ్ ఏజెంట్లు లేకుండా జరిగేది ఎన్నికలంటారా?
ఓటర్ జాబితా పరిశీలన పోలింగ్ ఏజెంట్ హక్కు
ఏజెంట్ల నుంచి ఫాం-12ను పోలీసులు లాక్కున్నారు
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లో కూర్చోనీయలేదు
15 బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లే లేకుండా చేశారు
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారు?
రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఏనాడూ ఎన్నికలు జరగలేదు
ప్రజాస్వామ్యం ఇంత దిగజారిన పరిస్థితులు బహుశా ఏనాడూ చూసి ఉండరు
ఏపీలో శాంతిభద్రతలు లేవు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు
నిన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా దాడులే అందుకు నిదర్శనం
పోలింగ్ బూత్‌ల్లో ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు