హుజూర్‌నగర్‌ నియోజకవర్గం తదుపరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌ నియోజకవర్గం తదుపరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?

Published Wed, Aug 9 2023 12:36 PM

Who Will Win In Next Elections Of Huzurnagar Constituency - Sakshi

హుజూర్‌నగర్‌ నియోజకవర్గం

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పిసిసి అద్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి 2018లో ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో కోదాడ నుంచి రెండుసార్లు, తదుపరి హుజూర్‌నగర్‌ నుంచి వరసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తంకుమార్‌ రెడ్డి తన సమీప టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డిపై 7466 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 2019లో ఉత్తం కుమార్‌ రెడ్డి లోక్‌ సభకు ఎన్నిక కాగా, హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది సైదిరెడ్డి భారీ ఆదిక్యతతో గెలిచారు. అప్పుడు ఉత్తం కుమార్‌ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్‌ ఐ తరపున పోటీచేసి ఓటమి చెందారు. అంతకుముందు 2014లో ఆమె కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

2018లో కోదాడలో ఓడిపోయిన తర్వాత హుజూర్‌నగర్‌లో మళ్లీ రంగంలో దిగి ఓటమి చెందారు. తెలంగాణలో 2014 ఎన్నికల తర్వాత ఉత్తం కుమార్‌ రెడ్డి పిసిసి అద్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ అదికారంలోకి రాలేకపోయింది. 2018 సాదారణ ఎన్నికలో ఉత్తంకుమార్‌రెడ్డికి 92996 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85530 ఓట్లు వచ్చాయి. సైదిరెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2019 ఉప ఎన్నికలో సైదిరెడ్డికి 43358 ఓట్ల ఆదిక్యత వచ్చింది. సైదిరెడ్డికి 113094 ఓట్లు రాగా కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన పద్మావతికి 69737 ఓట్లు మాత్రమే వచ్చాయి.

2018లో ఉత్తం కుమార్‌ రెడ్డికి 7466 ఓట్ల మెజార్గీ రాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఐ భారీతేడాతో ఓటమి చెందడం విశేషం. ఉప ఎన్నికలో బిజెపి, టిడిపిలు డిపాజిట్లు కోల్పోయాయి. 2014లో  ఉత్తం కుమార్‌ రెడ్డి  హుజూర్‌ నగర్‌లో గెలిస్తే, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి గెలుపొందడం విశేషం. 2009 శాసనసభలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో దంపతుల జంట దయాకరరెడ్డి, సీతలు మక్తల్‌,దేవరకద్ర ల నుంచి గెలుపొందగా, 2014లో ఆ అవకాశం ఉత్తంకుమార్‌ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలకు దక్కింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవీ దంపతులు  కూడా 1953,1962లలో ఒకేసారి గెలుపొంది శాసనభకు వెళ్లారు.

2014లో ఆ గౌరవం ఉత్తం దంపతులకు లభించింది. ఉత్తం కుమార్‌ రెడ్డి 2014లో రాష్ట్రపతి పాలన వచ్చేవరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్నారు. రాజకీయాలలోకి రావడానికి ముందు ఈయన రాష్ట్రపతి భవన్‌లో బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఉత్తంకుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పై  23924 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. 1952 నుంచి 1972వరకు ఈ నియోజకవర్గం ఉండేది. మూడుసార్లు పిడిఎఫ్‌, ఐదుసార్లు కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ, ఒకసారి టిఆర్‌ఎస్‌, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు.

హుజూర్‌నగర్‌లో రెండుసార్లు గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు కోదాడ నుంచి ఒకసారి గెలుపొందారు. ఈయన గతంలో కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. 1952లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కవి ముక్దుం మొహియుద్దీన్‌ గెలుపొందారు. 1952లో  ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రెండు స్థానాలు పిడిఎఫ్‌ గెలుచుకుంది. అయితే జయసూర్య మెదక్‌ నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికవడంతో ఏర్పడిన ఖాళీలో మొహియుద్దీన్‌ ఎన్నికయ్యారు. హుజూర్‌ నగర్‌ లో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బ్రాహ్మణ,బిసి,ఎస్‌.సి, ముస్లిం వర్గాలు ఒక్కోసారి గెలుపొందాయి.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement
 
Advertisement
 
Advertisement