బరాబర్‌ ధరణిని రద్దు చేస్తాం

 We Will Resolve Dharani Portal Problems Within 100 days After Getting power says Revanth Reddy - Sakshi

భూస్వాములు, కేసీఆర్‌ కుటుంబీకుల కోసమే దాన్ని తెచ్చారు: రేవంత్‌రెడ్డి 

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి 

పేదల భూములు వారికి చెందే వరకు ‘ధరణి అదాలత్‌’లు: మాణిక్‌రావ్‌ ఠాక్రే 

సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల రూరల్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను బరాబర్‌ రద్దుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్‌లో భూసమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులతో మీభూమి– మీహక్కు నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ‘ధరణి అదాలత్‌’గ్రామసభను నిర్వహించింది.

ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదుకాక, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యలను కాంగ్రెస్‌ నేతలు తెలుసుకున్నారు. తర్వాత వారికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గ్యారంటీ కార్డులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కొప్పుల రాజు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

భూస్వాములు, కేసీఆర్‌ కుటుంబీకుల కోసమే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని.. అందువల్లే గతంలో కాంగ్రెస్‌ పార్టీ పేదలకు పంచిన 22 లక్షల ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సీసీఎల్‌ఏ చేతిలో ధరణి పోర్టల్‌ లేదని.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి, వెనక నుంచి కేసీఆర్‌ కుటుంబీకులు వేలకోట్లు కాజేస్తున్నారని విమర్శించారు. 

అన్ని గ్రామాల్లో ‘ధరణి అదాలత్‌’ 
ధరణి పేరుతో కేసీఆర్‌ సర్కారు పేదల భూములను కబళిస్తోందని.. పేదలకు తిరిగి భూహక్కులు కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఏఐసీ సీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్‌ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

దివంగత సీ ఎం వైఎస్సార్, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనే పేదలకు భూయాజ మాన్య హక్కులు కల్పించారని.. బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ భూములను లాక్కుంటోందని జాతీయ నేత కొప్పుల రాజు ఆరోపించారు. 

కాంగ్రెస్‌ పంచ సూత్రాలివీ.. 
ధరణి పోర్టల్‌లో 60 లక్షల మంది పేర్లు ఉంటే.. అందులో దాదాపు 20 లక్షల ఖాతాల్లో పేరు, స ర్వే నంబర్‌తోపాటు చాలా తప్పులున్నాయి. అ న్నీ దిద్ది ఎవరి భూమిపై వారికి హక్కులివ్వాలి. 
మేమొచ్చాక రెండేళ్లలో భూముల రీసర్వే. 
 రాష్ట్రంలోని 125 భూచట్టాలు, 3 వేల జీవోలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే చట్టంగా తీసుకొస్తాం
బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధిస్తాం. భూయజమాని అనుమతి లేకుండా సేకరించవద్దంటూ 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచి్చన చట్టాన్ని కచి్చతంగా అమలు చేస్తాం. 
 తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులకు పథకాలు అందిస్తాం. 

కవితను బహిష్కరించలేదేం: రేవంత్‌రెడ్డి 
అవినీతికి పాల్పడితే కొడుకైనా, బిడ్డ అయినా జైలులో పెడతానని కొన్నిరోజుల కింద సీఎం కేసీఆర్‌ చెప్పారని, మరి మద్యం కుంభకోణానికి పా ల్పడిన ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు వస్తేనే పద వి నుంచి బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. 

ఇద్దరూ ఆడపిల్లలే..పట్టా పాస్‌బుక్‌ ఇవ్వాలి 
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూమిని కేటాయించి లావణి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ధర ణి తెచ్చాక భూమిని ఆ న్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో పట్టా దారు పాస్‌బుక్‌ ఇవ్వలేదు. నాకు ఇద్దరు ఆడ పిల్లలే. పనిచేస్తేనే పూటగడిచేది. సర్కార్‌  ఇప్పటికైనా పాస్‌బుక్‌ ఇవ్వాలి.       – కవ్వంపల్లి జ్యోతి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top