అశోక్ గజపతిరాజు దుర్బుద్ధి బయటపడింది: బొత్స సత్యనారాయణ

Vellampalli Srinivas And Botsa Satyanarayana Comments Ashoka Gajapathi Raju - Sakshi

సాక్షి, విజయనగరం: అశోక్‌ గజపతి దుర్బుద్ధి బయటపడిందని, ఆయన ప్రవర్తించిన తీరు, ఇలాంటి సంప్రదాయాలు విజయనగరం జిల్లాలో ఎప్పుడూ లేవని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రామతీర్థ ఆలయ శంకుస్థాపన కోసం ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈవో, ప్రధాన అర్చకుడిని అవమానపరిచారని తెలిపారు. ఆయనకు చైర్మన్‌గా ఆలయ అభివృద్ధి సంబంధించి బాధ్యత లేదని, అందుకోసం ఏనాడు గవర్నమెంట్‌ను కోరలేదని ధ్వజమెత్తారు. అశోక్‌గజపతి రాజు రాజరికపు అహంకారంతో ఉన్నారని, తప్పు చేసిన వారిని శ్రీరాముడు చూసుకుంటాడని చెప్పారు. ఆలయ అభివృద్ధిని అయన పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేస్తోందని బొత్స చెప్పారు.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతి రాజుని ఆహ్వానించామని మంత్రి అన్నారు. శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు వేసామని.. అశోక్ గజపతిరాజు శిలాఫలకాన్ని తోసివేయడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రోటోకాల్‌ ఉల్లంఘన జరగలేదని, ఎటువంటి అమర్యాద చేయలేదన్నారు. ఆలయధర్మకర్తగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top